తెలంగాణలో మరో బాలుడు మిస్సింగ్ కలకలం రేపుతోంది. అబిడ్స్‌లో ఓ చిన్నారిని కిడ్నాప్ చేసిన ఘటన మరువకముందే మరో ఘటన చోటుచేసుకోవడంతో ఆందోళన నెలకొంది. రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలో 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. ఆదివారం సెలవు కావడంతో రోజు మాదిరిగా ట్యూషన్ వెళ్లాడు. అయితే తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆ బాలుడి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. అయితే, ట్యూషన్‌కి రాలేదని అక్కడి సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
వెంటనే ఆ బాలుడి తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికిన ఫలితం రాలేదు. వెంటనే బంధువుల ఇళ్లల్లో వెతికిన చూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులతో కలిసి మీర్‌పూట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు మోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాలుగు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.