సంజయ్ కస్టడీ పిటిషన్ కొట్టివేత
వరంగల్ లో టెన్త్ పేపర్ లీకేజీ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కు కోర్టు బెయిలిచ్చింది. బండి సంజయ్ ని కస్టడీకి కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్..డిస్మిస్ చేసింది. ఈ కేసులో ఇప్పటికే పోలీసుల విచారణ పూర్తయ్యిందన్న సంజయ్ తరుపు లాయర్ల వాదనలతో కోర్టు ఏకీభవించింది. కస్టడీ అవసరం లేదని..పోలీసుల పిటిషన్ కొట్టివేసింది. దీంతో సంజయ్ తో పాటు జైలుకు వెళ్లిన మరో ముగ్గురికి బెయిల్ మంజూరు అయ్యింది.షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్టు కోర్టు తెలిపింది.