AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బోధన్ బీఆర్ఎస్ లో తారస్థాయికి చేరుకున్న వర్గవిభేధాలు

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో బీఆర్ఎస్ లో వర్గవిభేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎమ్మెల్యే షకీల్, మున్సిపల్ చైర్మన్ తూము పద్మ శరత్ రెడ్డిల మధ్య రాజకీయ వేడి రగులుతుంది. ఇరువర్గాలు పోటాపోటీగా మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఒకరికి వ్యతిరేకంగా మరొకరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు పోలీసులు ఎమ్మెల్యేకి మద్ధతుగా తమకు వార్నింగ్ ఇచ్చారంటూ.. శరత్ రెడ్డి వర్గం ఆరోపిస్తుంది. ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో తమను హెచ్చరిస్తున్నారంటూ.. శరత్ రెడ్డి వర్గం పోలీస్ స్టేషన్ దగ్గర నిరసన వ్యక్తం చేశారు. పోలీసులకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.దీంతో బీఆర్ఎస్ విభేధాల వేడి పోలీస్ స్టేషన్ కు తాకింది.

ANN TOP 10