AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏపీలో లారీ ఓనర్ల సమ్మె తాత్కాలిక వాయిదా: ప్రభుత్వంతో చర్చలు ఫలప్రదం!

ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం అర్ధరాత్రి నుంచి జరగాల్సిన లారీల సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. లారీ యజమానుల సంఘం ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు విజయవంతం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలోని రవాణా శాఖ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఇరు వర్గాల మధ్య సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయి.

లారీల ఫిట్‌నెస్ చార్జీలను ప్రభుత్వం పెంచడాన్ని నిరసిస్తూ లారీ ఓనర్ల సంఘం ఈ సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. సమ్మెలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని రవాణా వాహనాలను ఈ అర్ధరాత్రి నుంచి నిలిపివేస్తామని సంఘం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో, ప్రజలకు రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నివారించేందుకు కూటమి ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది.

లారీ ఓనర్ల అసోసియేషన్ నేతలను చర్చలకు ఆహ్వానించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ప్రభుత్వం సానుకూల స్పందన ఇవ్వడంతో, లారీ యజమానుల సంఘం తమ సమ్మెను తాత్కాలికంగా విరమించుకుంది. దీంతో రాష్ట్రంలో రవాణా సేవలకు ఎదురవబోయే పెద్ద ఆటంకం తప్పినట్లయింది.

ANN TOP 10