AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజు పెంపుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..

ఇంజినీరింగ్, వృత్తి విద్యా కళాశాలల్లో ఫీజుల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కళాశాలలు సమర్పించే అకౌంట్స్‌తో పాటు ఆయా కళాశాలల్లో విద్యా ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని మాత్రమే ఫీజులు నిర్ధారించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఫీజుల పెంపునకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

 

ఇంజినీరింగ్, వృత్తి విద్యా కళాశాలల్లో విద్యార్థుల హాజరు, ఫేషియల్ రికగ్నేషన్ అమలు, ఆధార్ ఆధారిత ఫీజుల చెల్లింపులు సహా విద్యార్థులను పరిశోధనల వైపు ప్రోత్సహిస్తున్నారా అనే అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. కళాశాలలు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయా? ఆ కళాశాలల్లో విద్యార్థులకు ప్లేస్‌మెంట్స్ ఎలా ఉన్నాయనే అంశాలపై దృష్టి సారించనుంది.

 

జాతీయ, అంతర్జాతీయ ర్యాంకింగ్‌లు, ప్రభుత్వ నిబంధనలను ఏ మేరకు అమలు చేస్తున్నారనే అంశాలను సైతం పరిశీలించిన తర్వాత కళాశాలల్లో ఫీజులను నిర్ధారించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ANN TOP 10