ఆదిలాబాద్: జిల్లాలో హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. జిల్లాలోని పలు ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస రెడ్డి పలు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, స్థానికులు ఆత్మీయంగా స్వాగతించారు. కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతన ప్రతి ఒక్కరికీ అవసరమని, మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని అన్నారు. పేదల కష్టాలు తొలిగించాలని, సుఖసంతోషాలతో జీవించేలా ప్రసాదించాలని దేవుడిని ప్రార్థించినట్లు తెలిపారు.
హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస రెడ్డి హనుమాన్ ఆలయాలను సందర్శించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు విరామం లేకుండా ఒకటి కాదు రెండు కాదు దాదాపు 30 ఆలయాలను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు పాడి పంటలు ,సుఖ సంతోషాలు , ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని భక్తి ప్రపత్తులతో శ్రీఆంజనేయున్ని ప్రార్థించారు.పలు చోట్ల పల్లకి సేవలో పాల్గొని తరించారు. భక్తి గీతాలు ఆలపించి భక్తులను ఉత్సాహపరిచారు. దస్నాపూర్,రామ్ నగర్,విద్యా నగర్,సంజయ్ నగర్,పోలీస్ కాలనీ,సుందరయ్య నగర్,హమాలీ వాడ,గాంధీ నగర్,రామ్ పూర్,పొన్నారి,ఖోడద్,హస్నాపూర్,బాలాజీ నగర్,అటెండర్ కాలనీ,రాజరాజేశ్వర కాలనీ,ఇందిరమ్మ కాలనీ,కైలాష్ నగర్,టీచర్స్ కాలని,ద్వారకా నగర్,మోచిగల్లీ, జైనథ్ మండలం పెండల్ వాడ తదితర గ్రామాలు ,కాలనీలలోని శ్రీ హనుమాన్ మందిరాలను సందర్శించి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆయన వెంట ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగర్కర్ శంకర్,సంతోష్ సింగ్ ఠాకూర్,కిష్టా రెడ్డి, సంజీవ్, బండి కిష్టన్న,నవీన్,గోలి వెంకటి ,హరీష్,లింగన్న తదితరులున్నారు.