AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కార్గిల్ విజయ్ దివస్.. అమరవీరులకు వాయుసేన నివాళులు..

కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులకు భారత వాయుసేన ఘనంగా నివాళులర్పించింది. కార్గిల్ యుద్ధం నాటి చిత్రాలతో ప్రత్యేక వీడియోను రూపొందించింది. ఆ వీడియోను వాయుసేన తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పంచుకుంది. అమరవీరుల ధైర్యం, త్యాగం దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని పేర్కొంది.

 

1999 మే – జులై మధ్య భారత్, పాకిస్థాన్ మధ్య కార్గిల్ యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ముజాహిదీన్ల ముసుగులో నియంత్రణ రేఖ దాటి భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన శత్రు సైన్యాలు కార్గిల్‌లో ఖాళీగా ఉన్న కీలక స్థావరాలను వశం చేసుకున్నాయి. వీరి ఆక్రమణను తెలుసుకున్న భారత సైన్యం ‘ఆపరేషన్ విజయ్’ను ప్రారంభించింది.

 

భారత సైన్యం ఎదురుదాడికి పాక్ సైన్యం బెంబేలెత్తి తోకముడిచి పారిపోయింది. పాక్ సైన్యాన్ని తరిమికొట్టినట్లు జులై 26న భారత సైన్యం ప్రకటించింది. ఇది జరిగి నేటికి సరిగ్గా 26 ఏళ్లు పూర్తయింది. అప్పటి నుంచి ప్రతి ఏటా జులై 26న కార్గిల్ విజయ్ దివస్‌ను నిర్వహించుకుంటూ అమరవీరులకు నివాళులర్పిస్తున్నారు.

ANN TOP 10