AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పబ్లిక్ డొమైన్‌లోకి వచ్చాక లీకేజీ ఎలా అవుతుంది: హైకోర్టు

టెన్త్ హిందీ క్వశ్చన్ పేపర్ లీకేజీ కేసులో అరెస్టయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రిమాండ్‌ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. హనుమకొండ కోర్టు డాకెట్ ఆర్డర్‌ను సస్పెండ్ చేయాలని కోరుతూ సంజయ్ తరఫున న్యాయవాదులు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది.

బండి సంజయ్‌పై ఉన్న ఆరోపణలు ఏంటని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పేపర్‌ పబ్లిక్ డొమైన్‌లోకి వచ్చాక లీకేజ్ ఎలా అవుతుందని అడిగింది. బండి సంజయ్ వాట్సాప్‌లో సర్క్యులేట్ చేశారు తప్ప, పేపర్ లీక్‌లో ఆయన ప్రమేయం ఎక్కడుందన్న ప్రశ్నించింది. పేపర్ బయటకు వచ్చాక రాజకీయ నేతగా సర్కులేట్ చేయంటంలో తప్పేంటని అడిగింది. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన ఏజీ పేపర్ లీక్ ఘటనలో బండి సంజయ్ కుట్రదారుడని వాదించారు. బండి సంజయ్ ఫోన్ ఇంకా ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. లోయర్ కోర్టులో ఉన్న బెయిల్ పిటిషన్‌పై ఈ రోజు నిర్ణయం తీసుకొనేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఎల్లుండి ప్రధాని పర్యటన ఉన్నందున.. బెయిల్ పిటిషన్‌పై విచారణ ఇవాళే ముగిసేలా ఆదేశాలివ్వాలని కోరారు. దీంతో బండి సంజయ్ బెయిల్ పిటిషన్‌కు హైకోర్టు అనుమతించింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ.. రిమాండ్ క్వాష్ పిటిషన్‌పై విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10