AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

క్రేజీ కాంబో..! బాలయ్య,వెంకటేష్ మల్టీస్టారర్..!

తెలుగు సినీ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఓ అరుదైన కలయికకు రంగం సిద్ధమైంది. అగ్ర కథానాయకులు నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేశ్ కలిసి ఒకే సినిమాలో నటించబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వెంకటేశ్ అధికారికంగా ప్రకటించడంతో సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

 

అమెరికాలో జరుగుతున్న నాట్స్ (NATS) 2025 వేడుకలకు హాజరైన వెంకటేశ్, అభిమానులతో ముచ్చటిస్తూ ఈ శుభవార్తను పంచుకున్నారు. త్వరలోనే బాలకృష్ణతో కలిసి కెమెరా ముందుకు రానున్నట్లు ఆయన తెలిపారు. చాలా కాలంగా పరిశ్రమలో వినిపిస్తున్న ఈ వార్తలకు వెంకటేశ్ ప్రకటనతో స్పష్టత వచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో మల్టీస్టారర్ చిత్రాల హవా నడుస్తుండగా, ఈ క్రేజీ కాంబినేషన్ ఆ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లనుంది.

 

ప్రస్తుతం బాలకృష్ణ ‘అఖండ 2’ చిత్రీకరణలో ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఆయన దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. ఈ సినిమాలోనే వెంకటేశ్ కూడా కీలక పాత్రలో నటించే అవకాశాలు ఉన్నాయని గట్టిగా వినిపిస్తోంది.

 

మరోవైపు వెంకటేశ్ ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలోనూ ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు బాలయ్యతో సినిమా ఖరారు కావడంతో ఇద్దరు అగ్ర హీరోల అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10