AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మెజిస్ట్రేట్ ఎదుట‌ బండి సంజ‌య్‌ హాజ‌రు

ప‌దో త‌ర‌గ‌తి ప్ర‌శ్న‌ప‌త్రాల‌ను బ‌య‌ట‌కు తీసుకొచ్చిన వైర‌ల్ చేసిన కేసులో రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌ను హ‌నుమ‌కొండ ప్రిన్సిప‌ల్ మెజిస్ట్రేట్ ఎదుట పోలీసులు బుధ‌వారం హాజ‌రుప‌రిచారు. పాల‌కుర్తి ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన అనంత‌రం ఆయ‌న‌ను వ‌రంగ‌ల్ పీటీసీకి త‌ర‌లించి, అక్క‌డ్నుంచి మెజిస్ట్రేట్ నివాసానికి త‌ర‌లించారు. కోర్టు వెనుక గేటు నుంచి ఆయ‌న‌ను లోప‌లికి తీసుకెళ్లి మెజిస్ట్రేట్ అనిత రాపోలు ఎదుట‌ ప్ర‌వేశ‌పెట్టారు. మెజిస్ట్రేట్ నివాసం ప్రాంగ‌ణంలో పోలీసులు భారీగా మోహ‌రించారు. భ‌ద్ర‌త పెంచారు. అక్క‌డ భారీగా గుమిగూడిన బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు చెద‌ర‌గొడుతున్నారు.

ANN TOP 10