AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేడు తెలంగాణలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్న నితిన్ గడ్కరీ..

కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నేడు (సోమవారం) తెలంగాణలో పర్యటించనున్నారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి గడ్కరీ తెలంగాణలో రూ.5,400 కోట్ల వ్యయంతో చేపట్టిన 26 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

 

గడ్కరీ షెడ్యూల్ ఇలా..

 

గడ్కరీ నాగ్‌పూర్ విమానాశ్రయం నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి 10.15 గంటలకు ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ చేరుకుంటారు. అక్కడ 10.30 నుంచి 11.30 గంటల వరకు రహదారి ప్రాజెక్టులకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

 

అనంతరం హైదరాబాద్ శివారులోని కన్హశాంతి వనంలో మధ్యాహ్నం 1 గంట నుంచి 3.30 వరకు పర్యటిస్తారు. అక్కడి నుంచి బీహెచ్ఈఎల్ అంబర్‌పేట ప్రాంతాల్లోని ప్రధాన ఫ్లైఓవర్‌ను ప్రారంభిస్తారు. అంతే కాకుండా రూ.657 కోట్ల విలువైన 21 కిలోమీటర్ల పొడవు ఉన్న 7 ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి గడ్కరీ వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు.

 

సాయంత్రం 6 గంటలకు అంబర్‌పేట మున్సిపల్ మైదానంలో జరిగే బహిరంగ సభలో గడ్కరీ పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం రాత్రి 7 గంటలకు ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.

ANN TOP 10