AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా కేజీఎఫ్, స‌లార్ చిత్రాల డైరెక్ట‌ర్‌ ప్రశాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఒక‌ సినిమా తెర‌కెక్కుతోన్న‌ విష‌యం తెలిసిందే. ‘ఎన్టీఆర్31’గా ఈ ప్రాజెక్ట్ రాబోతుంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను టాలీవుడ్ బ‌డా నిర్మాణ సంస్థ‌ మైత్రీ మూవీ మేక‌ర్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

 

ప్ర‌స్తుతం ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ నెల 22 నుంచి తార‌క్ కూడా ఈ మూవీ షూటింగ్‌లో జాయిన్ అయిన‌ట్లు తెలుస్తోంది. అయితే, తాజాగా ఈ సినిమా గురించి మేక‌ర్స్ బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. విడుద‌ల తేదీని ప్ర‌క‌టించారు.

 

ఈ సినిమాను వ‌చ్చే ఏడాది జూన్ 25న ప్ర‌పంచ‌వ్తాప్తంగా విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆస‌క్తిక‌ర పోస్ట‌ర్‌ను పంచుకున్నారు. ఇక‌, పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాకు రవి బస్రూర్‌ సంగీతం అందించనున్నారు. ఈ సినిమాకు ‘డ్రాగ‌న్’ అనే టైటిల్ ప్ర‌చారంలో ఉంది.

ANN TOP 10