AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అపస్మారక స్థితిలో ఉన్న బాలుడి హెల్త్ బులిటెన్ విడుదల

ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద ‘పుష్ప 2’ ప్రీమియర్‌ తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా, ఆ మహిళ కుమారుడు తీవ్రంగా గాయపడి వెంటిలేటర్‌పై ఉన్న విషయం తెలిసిందే. ఆ బాలుడి హెల్త్ బులిటెన్‌ను కిమ్స్ హాస్పిటల్ వైద్యులు విడుదల చేశారు. ప్రస్తుతం ఆ బాలుడి పరిస్థితి విషయంగానే ఉన్నట్లుగా ఈ బులిటెన్‌లో పేర్కొన్నారు. అతడు ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉన్నాడని, ఫీవర్ పెరుగుతుందని చెప్పిన వైద్యులు.. బాలుడి మెదడుకు ఆక్సిజన్ సరిగా అందట్లేదని తెలిపారు. ఇంకా అపస్మారక స్థితిలోనే బాలుడు ఉన్నాడని తెలిపారు. ప్రస్తుతం ట్యూబ్ ద్వారా ఆహారం పంపిస్తున్నామని తెలిపిన వైద్యులు.. ప్రస్తుతం పరిస్థితి క్రిటికల్‌గానే ఉన్నట్లుగా పేర్కొన్నారు.

డాక్టర్స్ హెల్త్ బులిటెన్ విడుదల చేయకముందు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శితో క్రిస్టినాతో కలిసి బాలుడిని పరామర్శించేందుకు వెళ్లారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. ‘‘దాదాపు 13 రోజులుగా బాలుడికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో బాలుడికి ఆక్సిజన్ అందర బ్రెయిన్ బాగా డ్యామేజ్ అయింది. ప్రస్తుతం వెంటిలేటర్ సాయంతో ఆక్సిజన్ అందిస్తున్నారు. అతను పూర్తిగా కోలుకునేందుకు చాలా సమయం పడుతుందని డాక్టర్స్ చెబుతున్నారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్స్ నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నారు. త్వరలోనే బాలుడు కోలుకుంటాడని ఆశిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10