AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలెర్ట్‌.. పరీక్షల షెడ్యూల్‌ ఇదిగో…

తెలంగాణ ఇంటర్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. వచ్చే మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు ప్రకటించింది. ప్రాక్టికల్‌ పరీక్షలు ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. జనవరి 29న ఇంటర్‌ ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వాల్యూస్‌ పరీక్ష, 30న పర్యావరణ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది. రెండు పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు జరుగుతుందని పేర్కొంది. ఇంగ్లిష్‌ ప్రాక్టికల్స్‌ ఫస్టియర్‌ విద్యార్థులకు జనవరి 31న, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 1న జరుగుతుందని తెలిపింది.

ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు ఇలా..

మార్చి 5న సెకండ్ ల్యాంగ్వేజ్ పేపర్
మార్చి 7న ఇంగ్లీష్ పేపర్
మార్చి 11న మ్యాథ్స్ పేపర్ 1ఏ / బోటనీ / పొలిటికల్ సైన్స్
మార్చి 13న ఫిజిక్స్ / ఎకనామిక్స్
మార్చి 28న కెమిస్ట్రీ / కామర్స్
మార్చి 19న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ (బైపీసీ స్టూడెంట్స్‌కి)
మార్చి 24న మోడ్రన్ ల్యాంగ్వేజ్ / జాగ్రఫీ

ఇంటర్ సెకండియర్‌ పరీక్షలు ఇలా..

మార్చి 6న సెకండ్ ల్యాంగ్వేజ్
మార్చి 10న ఇంగ్లీష్
మార్చి 12న మ్యాథ్స్ పేపర్ 2ఏ / బోటనీ / పొలిటికల్ సైన్స్
మార్చి 15న మ్యాథ్స్ పేపర్ 2బీ/జువాలజీ / హిస్టరీ2
మార్చి 18న ఫిజిక్స్ పేపర్‌ 2 / ఎకనామిక్స్ పేపర్‌ 2
మార్చి 20న కెమిస్ట్రీ పేపర్‌ 2/ కామర్స్ పేపర్‌
మార్చి 22న పబ్లిక్ అడ్మినిస్టరేషన్ పేపర్ 2 / బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ 2 (బైపీసీ స్టూడెంట్స్)
మార్చి 25న మోడ్రన్ ల్యాంగ్వేజ్ పేపర్ 2 / జాగ్రఫీ

ANN TOP 10