AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్కతా నైట్ రైడర్స్

ఐపీఎల్ 2023లో శనివారం డబుల్ ధమాకా. మొహాలీ వేదికగా జరిగే మొదటి మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగా ఈ మ్యాచులో టాస్ గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

రెండు జట్ల మధ్య గత ఐదు మ్యాచుల గణాంకాలను పరిశీలిస్తే.. కోల్‌కతా మూడింటిలో గెలిచింది. పంజాబ్ కింగ్స్ రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇక మొహాలీ మ్యాచులో పంజాబ్ కింగ్స్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. సొంత గడ్డ కావడంతో పంజాబ్ జట్టుకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ల్ కతా నైట్ రైడర్స్ నుంచి పంజాబ్ కు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.

కోల్‌కతా నైట్ రైడర్స్ తుది జట్టు: రహ్మానుల్లా గుర్బాజ్, మన్‌ దీప్ సింగ్, నితీశ్ రాణా(కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, సౌథీ, అనుకుల్ రాయ్, ఉమేశ్ యాదవ్, వరుణ్ చకరవర్తి

పంజాబ్ కింగ్స్ తుది జట్టు: శిఖర్ ధావన్(కెప్టెన్), ప్రభ్‌ సిమ్రాన్ సింగ్, భానుకా రాజపక్సే, జితేశ్ శర్మ, ఖాన్, సామ్ కర్రాన్, సికందర్ రజా, నాథన్ ఎల్లిస్, హర్‌ ప్రీత్ బ్రార్, రాహుల్ చాహెర్, అర్ష్‌దీప్ సింగ్

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10