కదులుతోన్న ఆర్టీసీ బస్సులో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటన తిరుపతి జిల్లాలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి వెళ్తోన్న బస్సు ఏర్పేడు సమీపంలోకి వచ్చినప్పుడు ఈ విషాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే బస్సు కండక్టర్ రేణిగుంట వద్ద గుర్తించాడు. బస్సులో వెనుక సీటు సీటు వద్ద హ్యాంగర్‌కు యువకుడు ఉరి వేసుకుని వేలాడుతుండటం అతడు గమనించాడు. వెంటనే డ్రైవర్‌కు విషయం చెప్పి.. బస్సు నిలిపివేయించాడు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆ సమయంలో బస్సులో ముగ్గురు ప్రయాణీకులు మాత్రమే ఉండటం… చివరి సీటులో యువకుడు కూర్చుకోవడంతో అంతగా గమనించలేదు.
కండక్టర్ ఫిర్యాదు మేరకు రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. రేణిగుంట ఆసుపత్రికి తరలించారు మేర్లపాక స్టేజీ వద్ద ఈ యువకుడు ఆదివారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు ఎక్కాడు. మేర్లపాక నుంచి టికెట్ తీసుకున్నట్టు కండక్టర్ తెలిపారు. అయితే, యువకుడు ఎవరు? ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? అనే వివరాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై అనుమానాస్పద మరణంగా పోలీసులు కేసు నమోదుచేశారు. దర్యాప్తులో వివరాలు తెలుస్తాయని అన్నారు.