AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మెట్రో రైళ్లలో ప్రయాణికులకు రాయితీ కుదింపు

హైదరాబాద్: నగరంలోని మెట్రో రైళ్లలో (Metro Rail) ప్రయాణికు(Passengers)లకు రాయితీ కుదింపు (Concession Reduction ) చేశారు. స్మార్ట్ మెట్రో కార్డులు (Smart Metro Cards), క్యూఆర్ కోడ్ టికెట్‌ (QR Code Ticket)లకు 10 శాతం రాయితీ ఎత్తివేశారు. శుక్రవారం నుంచి రద్దీలేని సమయాల్లో మాత్రమే 10 శాతం రాయితీ వర్తింపు చేశారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటలు.. రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే 10 శాతం రాయితీ వర్తింపు చేశారు. సూపర్ సేవర్ హాలి డే కార్డు (Super Saver Holiday Card)ను రూ. 59 నుంచి 99 రూపాయలకు పెంపు చేశారు. 99 రూపాయలతో అపరిమితంగా నిర్దేశించిన సెలవురోజుల్లో ప్రయాణాల సౌలభ్యం కల్పిస్తారు. కాగా హైదరాబాద్ మెట్రో రైళ్లలో ప్రతి రోజూ 4.4 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు.

ANN TOP 10