AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీఆర్‌ఎస్‌ పనైపోయింది.. అందుకే ఆ పార్టీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుండ్రు..

మేము ఏడాదిలో చేపట్టిన అభివృద్ధిపై చర్చకు సిద్ధం
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ సవాల్‌
మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని స్పష్టీకరణ

(మహా, హైదరాబాద్‌):
బీఆర్‌ఎస్‌కు నూకలు చెల్లాయని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే ఆపార్టీ నేతలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల అభివృద్ధి, తాము ఏడాదిలో చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని సవాల్‌ విసిరారు. శనివారం గాంధీభవన్‌ లో మహేష్‌ కుమార్‌ గౌడ్‌ మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మూసీ నిద్ర ప్రజల అటెన్షన్‌ డైవర్ట్‌ చేయడానికేనని విమర్శించారు. బీజేపీ నేతల మూసీ నిద్ర వల్ల ఒరిగేది ఏమీ ఉండదని అన్నారు. మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ఏడాది పాలనపై విజయోత్సవాలు జరుపుతున్నామని చెప్పారు. మహిళలకు, అన్నివర్గాల ప్రజలకు ఏం చేశామో వరంగల్‌ విజయోత్సవ సభలో వెల్లడిస్తామని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ పేర్కొన్నారు.

ANN TOP 10