అహ్మదాబాద్: సమ్మర్ క్రికెట్ కార్నివాల్ ఐపీఎల్‌కు అంతా సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు తొలి మ్యాచ్ జరగనుండగా.. అంతకు ముందు ఆరు గంటలనుంచి గ్రాండ్‌గా ఓపెనింగ్ సెర్మనీని నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఆరంభోత్సవంలో సినీ తారలు రష్మిక మందాన, తమన్నా భాటియా, సింగర్ అర్జిత్ సింగ్ తమ ఆటపాటలతో అలరిస్తారు. కత్రీనా కైఫ్, టైగర్ ష్రాఫ్ కూడా పాల్గొంటారని సమాచారం. ఈ ఆరంభ వేడుకలు స్టార్‌స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి.