AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అసెంబ్లీలోనే పొర్న్‌ వీడియో చూసిన ఎమ్మెల్యే

ఏ రాష్ట్రంలోనైనా సరే అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయంటే చాలు… అధికార, ప్రతిపక్ష నేతల విమర్శలు, ప్రతివిమర్శలతో సభా ప్రాంగణమంతా దద్దరిల్లిపోతుంది. ఆ సభలలో ప్రజా సమస్యల కంటే ఒకరినొకరు తిట్టుకోవడానికే సమయం ఎక్కువగా తీసుకుంటారనేది మనందరికీ తెలిసిన విషయమే. అయితే గతంలో ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు స్పీకర్ నిద్రపోవడం తెలుగు రాష్ట్రాల్లో దుమారం లేపింది. ఇప్పుడు తాజాగా త్రిపురాలోని ఓ ఎమ్మెల్యే అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా అశ్లీల చిత్రాలు చూడటం అందరినీ అవక్కాయ్యేలా చేస్తోంది.

త్రిపురాలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. బగ్ బాస్సా నియోజకవర్గంలో బీజేపీ నుంచి ఎన్నికైన జదవ్ లాల్ నాథ్ అనే ఎమ్మెల్యే ఆ సమావేశాలకు హాజరయ్యారు. ఒకపక్క అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ కు సంబంధించిన విషయంపై చర్చలు జరుగుతున్నాయి. కానీ ఈయన మాత్రం కూర్చిలో కూర్చోని తన మొబైల్ లో ఓ పొర్న్‌ వీడియో చూడటం కలకలం రేపింది. జదవ్ లాల్ తన మొబైల్ లో వస్తున్న వీడియోలను స్క్రోల్ చేస్తూ చూస్తున్నారు. పొర్న్‌ వీడియో రావడంతో దాన్ని స్క్రోల్ చేయకుండా దాన్ని అలాగే చూశారు. అయితే దీన్ని ఆ ఎమ్మెల్యే వెనుక కూర్చొని ఉన్న మరో వ్యక్తి దాన్ని వీడియో తీయడంతో ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జదవ్ లాల్ నాథ్ తీరుపై బీజేపీ సీరియస్ అయ్యింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆ ఎమ్మెల్యేను కోరగా ఆయన మాత్రం ఇంతవరకు దీనిపై స్పందించలేదు.

పబ్లిక్ ప్లేస్ లో బీజేపీ నాయకులు పొర్న్‌ వీడియో చూస్తూ దొరికిపోవడం ఇది మొదటిసారి కాదు. 2012లో కూడా కర్నాటకలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పడు లక్ష్మణ్ సావడి, సీసీ పాటిల్ అనే ఇద్దరు బీజేపీ మంత్రులు పొర్న్‌ వీడియో చూస్తూ దొరికియారు. ఆ తర్వాత వారు బలవంతంగా రాజీనామ చేయాల్సి వచ్చింది. దీనిపై విచారణ మొత్తం పూర్తయ్యాక మళ్లీ బీజేపీ వారికి తమ పదవులు ఇచ్చింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10