ఇంద్రకీలాద్రి పై భక్తుల రద్దీ కొనసాగుతోంది. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు కనకదుర్గగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. జై దుర్గా జై జై దుర్గ అన్న నామస్మరంతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. కాగా దుర్గమును దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భవానీలు వచ్చారు. మూలా నక్షత్రం వేళ భక్తులు అంచనాలకు మించి రావటంతో కొంత ఇబ్బంది ఏర్పడింది.
ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారు బుధవారం సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి ఆలయం మూసివేసే సమయానికి సుమారు 1.50 లక్షల నుంచి 2 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారని అధికారుల అంచనా. సీఎం చంద్రబాబు దంపతులు, మంత్రి లోకేశ్ దంపతులు ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. శరన్నవరాత్రి మహోత్సవాలలో అత్యంత కీలకమైన మూలా నక్షత్రం నాడు ఎలాంటి వివాదాలు, ఆటంకాలు లేకుండా భక్తులు దుర్గమ్మను సరస్వతీ అలంకారంలో దర్శనం ఇస్తున్నారు.