తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీఎం నారా చంద్రబాబు నాయుడు దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకు ముందు తిరుమలలోని బేడీ ఆంజనేయ స్వామిని చంద్రబాబు దంపతులు దర్శించుకున్నారు. అటుపై వెండి పళ్లెంలో పట్టు వస్త్రాలు తీసుకుని శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. పట్టు వస్త్రాలు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. సీఎం చంద్రబాబు వెంట టీటీడీ ఈఓ శ్యామలరావు తదితరులు ఉన్నారు.