అమ్మన్యూస్ ఆదిలాబాద్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్ లో గల ఓ గోదాంలో 43 లక్షల విలువ చేసే మత్తుపదార్ధాలను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్టిఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. ఎక్సైజ్ ఎస్ టి ఎఫ్ సూపరింటెండెంట్ ప్రదీప్ రావు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ హెడ్ ఆఫీస్ కు వచ్చిన పక్క సమాచారం మేరకు నిర్మల్లోని గంధం శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఆయన ఇంట్లో 3.3 కిలోల అల్ఫాజోలం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు శాంతినగర్ లోని ఓ గోదాంలో నిల్వ చేసిన 728 క్లోరల్ హైడ్రేట్ పట్టుకున్నట్లు తెలిపారు. గంధం శ్రీనివాస్ గౌడ్ కి అల్ఫాజోలం ను సోలాపూర్ శీను ఎలియాస్ భాయ్ ,క్లోరల్ హైడ్రేడ్ ను రాజస్థాన్ కు చెందిన రూప్ సింగ్ అనే వ్యక్తి గత కొంతకాలంగా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. వీటిని కల్తీ కళ్ళు తయారీకి వినియోగిస్తారన్నారు. నిషేధిత మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.