హస్నాపూర్‌లో అమ్మవారి మండపాన్ని దర్శించిన మౌనారెడ్డి
(అమ్మన్యూస్, ఆదిలాబాద్)
దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా తాంసీ మండలం హస్నాపూర్ గ్రామంలోని శారదాదేవి మండపాన్ని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి సతీమణి కంది మౌనారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అందరికీ శుభాలు కలగాలని, సుఖసంతోషాలతో జీవనం సాగించాలని అమ్మవారిని వేడుకున్నారు.
