హైదరాబాద్ మహానగరంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో సోమవారం మధ్యాహ్నం నుంచి ఎడతెరపి లేకుండా కుండ పోతగా వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలు జలమయమైనాయి. ఈ వర్షం కారణంగా.. ఆ యా ప్రాంతాల్లో ట్రాఫిక్ భారీగా స్తంభించింది.
ఒక్కసారిగా వర్షం ప్రారంభం కావడంతో.. వాహనాదారులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం ఇప్పటికే వెల్లడించింది. దీంతో ఎల్లో అలర్ట్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే.