(అమ్మన్యూస్, ఆదిలాబాద్):
కాంగ్రెస్లోకి చేరికల పర్వం కొనసాగుతూనే ఉంది. ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాస రెడ్డి సమక్షంలో చేరికలు జోరందుకున్నాయి. సుందరయ్య నగర్, కేఆర్కే కాలనీ, తాటిగూడ, చందా-టీ నుంచి 800 మంది కంది శ్రీనివాస రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం 15వ వార్డు సుందరయ్య నగర్ కాలనీ వాసులు మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని, మొహమ్మద్ రఫీక్,మందాకిని – సతీష్ గార్ల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేఆర్కే కాలనీ జహీర్ రంజాని, గిమ్మ సంతోష్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీటీసీ లామ్త్లే సంతోష్ తో పాటు పెద్ద సంఖ్యలో కాలనీ వాసులు చేరారు. అలాగే పోరెడ్డి కిషన్ గారి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ రూరల్ మండలం చాందా ( టీ) గ్రామం నుంచి, జహీర్ రంజానీ, షకీల్ ఆధ్వర్యంలో తాటిగూడ నుంచి వందల మంది కంది శ్రీనివాసరెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానిచారు.కంది శీనన్న నాయకత్వం వర్ధిల్లాలి అన్న నినాదాలతో ప్రజాసేవ భవన్ దద్దరిల్లింది. సుమారు 800 మంది తరలి రావడంతో ప్రజాసేవాభవన్ లో జనజాతర అయ్యింది.
పెద్ద ఎత్తున చేరికలు..
ఇంత పెద్ద సంఖ్యలో చేరికలతో పండుగలా ఉందని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. చేరిన వారందరికీ చప్పట్లతో స్వాగతం పలికారు. పార్టీలో చేరిన వారంతా ఆరు గ్యారంటీ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కంది శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు. పేద బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ ఎంతో పనిచేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని గరీబోళ్ల బతుకులు మారాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేయాలనిసూచించారు. ఆదిలాబాద్ ప్రజలకు సేవ చేయడమే తన జీవిత లక్ష్య మని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిమ్మ సంతోష్, జహీర్ రంజానీ, కలాల శ్రీనివాస్, పోరెడ్డి కిషన్, రఫీక్, డాక్టర్ మారుతి ,సంతోష్ ,అల్చెట్టి నాగన్న, షకీల్ ఖయ్యూం, నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.