AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఉత్తమ తెలుగు చిత్రం కార్తికేయ 2.. బెస్ట్‌ యాక్టర్‌గా రిషబ్‌ శెట్టి

70వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన

(అమ్మన్యూస్, న్యూఢిల్లీ):
కేంద్ర ప్రభుత్వం 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించింది. ఈసారి ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ 2 అవార్డు గెలుచుకుంటే కన్నడ చిత్రంగా కేజీఎఫ్‌ 2 నిలిచింది. అలానే ఉత్తమ జాతీయ చిత్రంగా మలయాళ సినిమా ఆట్టమ్‌ నిలిచింది. మరోవైపు జాతీయ ఉత్తమ నటుడిగా రిషబ్‌ శెట్టిని అవార్డు వరించింది.

సౌత్‌ ఇండియన్స్‌దే హవా..
2022 డిసెంబర్‌ 31 నాటికి సెన్సార్‌ పూర్తి చేసుకున్న చిత్రాలకే ఈ పురస్కారాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈసారి ఉత్తమ నటీనటుల అవార్డులను సౌత్‌ ఇండియన్‌ యాక్టర్సే గెలుచుకోవడం విశేషం. అలానే ఉత్తమ సినిమా అవార్డు కూడా సౌత్‌ ఇండియాకే దక్కింది.
నేషనల్‌ అవార్డుల లిస్టు ఇదే..
ఉత్తమ నటుడు: రిషబ్‌ శెట్టి (కాంతార – కన్నడ)
ఉత్తమ నటి: నిత్య మేనన్‌ (తిరుచిత్రాంబళం – తమిళ్‌), మానసి పరేఖ్‌ (కచ్‌ ఎక్స్‌ప్రెస్‌ – గుజరాతి)
ఉత్తమ చిత్రం: ఆట్టమ్‌ (మలయాళం)
ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు): కార్తికేయ 2
ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తమిళం): పొన్నియిన్‌ సెల్వన్‌ – 1
ఉత్తమ ప్రాంతీయ చిత్రం (కన్నడ): కేజీయఫ్‌ 2
ఉత్తమ ప్రాంతీయ చిత్రం (మలయాళం): సౌది వెళ్లక్క సీసీ 225/2009
ఉత్తమ ప్రాంతీయ చిత్రం (హిందీ) : గుల్‌మోహర్‌
ఉత్తమ ప్రాంతీయ చిత్రం (బెంగాళీ): కబేరి అంతర్దాన్‌
ఉత్తమ ప్రాంతీయ చిత్రం (ఒడియా): దమన్‌
ఉత్తమ ప్రాంతీయ చిత్రం (మరాఠీ): వాల్వీ (ది టెర్మైట్‌)
ఉత్తమ ప్రాంతీయ చిత్రం (పంజాబీ): బాగీ డి దీ
ఉత్తమ దర్శకుడు: సూరజ్‌ బర్జాత్యా (ఉంచాయి – హిందీ)
ఉత్తమ దర్శకుడు (డెబ్యూ): ప్రమోద్‌ కుమార్, ఫౌజా (హరియాన్వీ)
ఉత్తమ సహాయ నటి: నీనా గుప్తా (ఉంచాయి– హిందీ)
ఉత్తమ సహాయ నటుడు: పవర్‌ రాజ్‌ మల్హోత్రా (ఫౌజా – హరియాన్వి)
ఉత్తమ చైల్డ్‌ ఆర్టిస్ట్‌: శ్రీపాథ్‌ (మలికాపురమ్‌ – మలయాళం)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: పొన్నియిన్‌ సెల్వన్‌ పార్ట్‌ – 1 (తమిళం), సినిమాటోగ్రాఫర్‌: రవి వర్మన్‌
ఉత్తమ ప్లే బ్యాక్‌ సింగర్‌ : అర్జిత్‌ సింగ్‌ (కేసరియా) – బ్రహ్మాస్త్ర– పార్ట్‌ 1: శివ (హిందీ)
ఉత్తమ ఫిమేల్‌ ప్లే బ్యాక్‌ సింగర్‌ : బాంబే జయశ్రీ (చాయుమ్‌ వెయిల్‌), సౌదీ వెల్లక్క సీసీ 225/2009
బెస్ట్‌ కొరియోగ్రీఫీ: జానీ మాస్టర్, సతీష్‌ కష్ణన్‌ తిరుచిత్రాంబళం (తమిళ్‌)
బెస్ట్‌ యాక్షన్‌  డైరక్షన్‌: అన్బరివు (కేజీయఫ్‌ 2)
ఉత్తమ సంగీతం (పాటలు): బ్రహ్మస్త్ర: శివ (హిందీ) – ప్రీతమ్‌
ఉత్తమ సంగీతం (నేపథ్యం): పొన్నియిన్‌ సెల్వన్‌ – 1 (తమిళ్‌), సంగీత దర్శకుడు: ఏఆర్‌ రెహమాన్‌
బెస్ట్‌ లిరిక్స్‌: ఫౌజా (హరియాన్వీ), రచయిత: నౌషద్‌ సదర్‌ ఖాన్‌
ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌ సినిమా: బ్రహ్మాస్త్ర – పార్ట్‌ 1: శివ

 

ANN TOP 10