AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రుణమాఫీ అయిపాయె.. నీ రాజీనామా ఏమాయె?.. నగరంలో హరీశ్‌రావుపై ఫ్లెక్సీల కలకలం

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మాట నిలుపుకోవాలంటూ ఫ్లెక్సీల ఏర్పాటు
హీటెక్కిన తెలంగాణ రాజకీయాలు

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
రైతు రుణమాఫీ వేళ తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌ రావుకు వ్యతిరేకంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్‌ ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేశారని.. హరీశ్‌ రాజీనామా చేసే తన మాట నిలబెట్టుకోవాలని ఫ్లెక్సీలపై రాశారు. హరీశ్‌రావుకు వ్యతిరేకంగా రాత్రికి రాత్రే మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు అభిమానుల పేరిట కొందరు ఈఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ‘దమ్ముంటే రాజీనామా చెయ్‌.. రుణమాఫీ అయిపోయే.. నీ రాజీనామా ఏడ బోయే.. అగ్గిపెట్ట హరీశ్‌ రావు’ అని రాసి ఉన్న ఫ్లెక్సీలను సికింద్రాబాద్, ప్యాట్నీ, ప్యారడైజ్, రసూల్‌ పుర, బేగంపేట్, పంజాగుట్ట సహా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు..

మాట నిలబెట్టుకున్నాం..
ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా రూ.2 లక్షల రుణమాఫీ చేశామని, ఇచ్చిన హామీని మేం నిలబెట్టుకున్నందుకు.. హరీశ్‌ రావుకు సిగ్గుంటే రాజీనామా చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి సైతం ఖమ్మం పర్యటనలో సవాల్‌ చేశారు. సీఎం కామెంట్లు చేసిన తర్వాత రాత్రికి రాత్రే ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. కాగా, గతంలో ప్రభుత్వానికి పలు అంశాలపై హరీష్‌ రావు సవాల్‌ విసిరారు. రేవంత్‌ సర్కార్, రైతు రుణమాఫీతో పాటు ఆరు గ్యారంటీలు అమలు చేస్తే తాను అమరవీరులల స్తూపం వద్ద రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే హరీష్‌కు వ్యతిరేకంగా సీఎం రేవంత్‌ కామెంట్లు చేయటంతోపాటు తాజాగా ఫ్లెక్సీలు కూడా వెలిశాయి.

ANN TOP 10