గుండాల మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సాయనపల్లి ఏఎన్ఎం గా పని చేస్తున్న పూనెం కమలకుమారి ఉత్తమ అవార్డు అందుకున్నారు. ఆమె ఉత్తమ సేవలకు గుర్తింపు లభించింది. స్వాతంత్య్ర దినోత్సవం వేళ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదగా ప్రశంసా పత్రం అందుకున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ, ఆదివాసియేతర పేద ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వైద్య సేవలను అందించడం అభినందనీయమని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, వైద్య సేవలు అందించాలని సూచించారు.
