AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీసీ బిల్లు పెట్టాల్సిందే.. పార్ల‌మెంట్‌ వ‌ద్ద భారీ ప్రదర్శన

జన గణనలో కులగణన చేపట్టాలని, పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు పెట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్య‌క్షుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆర్ కృష్ణ‌య్య డిమాండ్ చేశారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు, ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు రిజర్వేషన్లు పెట్టాలన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్వర్యంలో డిల్లీలోని పార్లమెంట్ వద్ద భారీ ప్రదర్శన జరిపారు.

ఈ భారీ ప్రదర్శనకు జాతీయ బీసీ యువజన సంఘం అధ్యక్షులు గువ్వల భరత్ కుమార్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం అధ్యక్షత వహించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ సమన్వయం చేశారు. వందలాది మంది సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పార్లమెంట్ కు రావడంతో జంతర్ మంతర్ దద్దరిల్లిపోయింది. `ఓట్లు బీసీలవి – సీట్లు అగ్రకులాలకా! జనాభా ప్రకారం వాటా పంచాలి` అంటూ ధ‌ర్నాకు హాజ‌రైన ఆందోళ‌న‌కారులు నినాదాలు చేశారు.

ANN TOP 10