సన్మానించిన సీఎం
(అమ్మన్యూస్, హైదరాబాద్):
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ మాజీ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ను కలిశారు. రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం రాజ్‌భవన్‌కు వెళ్లి రాధా కృష్ణన్ మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. రాధా కృష్ణన్‌ను శాలువాతో సన్మానించారు. తెలంగాణ సహా దేశంలోని వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన సంగతి తెలిసిందే.
ఇన్నాళ్లు తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహించిన జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణను మహారాష్ట్రకు బదిలీ చేశారు. మరో వైపు సీఎం రేవంత్ రెడ్డి రుణ మాఫీకి సంబంధించి అసెంబ్లీ ప్రకటన చేసే అవకాశం ఉంది. మంగళవారం రెండో దశ రుణ మాఫీ చేయనున్నారు.