టాలీవుడ్ పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సింగపూర్‌లో సందడి చేశారు. సింగపూర్ నేషనల్ యూనివర్సిటీలో జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు. ఈ నేపథ్యంలో జరిగిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి హాజరయ్యేందుకు పవన్ కళ్యాణ్ దంపతులు సింగపూర్ వెళ్లారు.
పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవాతో కలిసి విమానం ఎక్కేందుకు వెళ్లిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత అన్నా కొణిదెల గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పట్టా అందుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ తో కలిసి అన్నా లెజినోవా ఫొటోలు దిగారు. కొద్ది రోజుల క్రితం వరకు వారాహీ దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్.. దీక్షా వస్త్రాల్లోనే కనిపించారు. సింగపూర్ పర్యటనలో మాత్రం పవన్ కళ్యాణ్ సింపుల్ ఫార్మల్ లుక్‌లో కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది.