తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడంతో పాటు మరికొందరికి పోస్టులను ఇచ్చింది. రవాణా, గృహనిర్మాణం, జీఏడీ ప్రత్యే కార్యదర్శి వికాస్ రాజ్‌ను నియమించింది. జేఏడీ ముఖ్య కార్యదర్శి బెనహర్ మహేశ్ దత్ ఎక్కాను, గిరిజన సంక్షేశాఖ కార్యదర్శి బాధ్యతలను ఏ శరత్‌కు అప్పగించింది.
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా కొర్ర లక్ష్మిని బదిలీ చేసింది. రెవెన్యూ (డిజాస్టర్ మేనేజ్‌మెంట్) స్పెషల్ సెక్రెటరీగా ఎస్ హరీశ్‌ను, మేడ్చల్ మల్కాజ్‌గిరి అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా రాధికా గుప్తాను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.