పెరువియన్ అమెజాన్‌లో ఇప్పటివరకు ప్రపంచానికి పరిచయం లేని తెగకు సంబంధించిన మనుషులు కనిపించారు. బ్రెజిల్ సరిహద్దులో ఉన్న ఆగ్నేయ పెరువియన్ ప్రావిన్స్‌లోని మాడ్రే డి డియోస్‌లోని నది ఒడ్డున ‘మాస్కో పిరో’ అనే తెగకు చెందిన మనుషులు సంచరిస్తున్న ఫోటో ఒకటి ఆంగ్లమీడియాలు ప్రచురించాయి. ఈ ఫొటోను ‘సర్వైవల్ ఇంటర్నేషనల్’కు చెందిన వారు తీసినట్లు తెలుస్తోంది.
