AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య

శంషాబాద్‌ మున్సిపల్‌లో శుక్రవారం దారుణం చోటు చేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తాను ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు పిల్ల లను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం బీదర్‌ కు చెందిన సోమశేఖర్‌, ప్రియాంక(26) దంపతులు వలసొచ్చి ఆర్బీనగర్‌ బస్తీలో అద్దెకుంటున్నారు. సోమశేఖర్‌ ఓ కొరియర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరికి ఇద్దరు సంతానం ఆద్విక్‌(3), ఆరాధ్య(7 నెలలు) ఉన్నారు. భర్త డ్యూటీ ముగించుకొని ఇంటికొచ్చే సరికి భార్య ఉరేసుకొని చనిపోయింది. విషం ఇవ్వడంతో కొట్టుమిట్టాడుతున్న ఇద్దరు పిల్లలను బస్తీవాసులు నగరంలోని నీలోఫర్‌ ఆసుపత్రికి తరలించారు. ఆద్విక్‌ కోలుకుంటుండగా ఆరాధ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ప్రియాంక పిల్లలకు విషం ఇచ్చి ఎందుకు ఆత్మహత్య చేసుకుందన్న వివరాలు తెలియరాలేదు. ఆర్జీఐఏ పోలీసులు ఆనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. సీఐ బాల్‌రాజ్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ANN TOP 10