AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె విరమణ.. కీలక వివరాలు తెలిపిన మంత్రి దామోదర

తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహాకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. జూడాల సమస్యలను అర్థం చేసుకున్నామని తెలిపారు. వారు ప్రభుత్వం ముందు పెట్టిన డిమాండ్లను నెరవేరుస్తున్నామని చెప్పారు.

మొత్తం 3 మెడికల్ కాలేజీలకు సంబంధించిన 204.85 కోట్ల రూపాయల నిధులకు ఉత్తర్వులను జారీ చేసినట్లు వివరించారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో లేడీస్ హాస్టల్ నిర్మాణానికి 80 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నామని తెలిపారు.

కీలక నిర్ణయాలు ఇవే

ఉస్మానియా మెడికల్ మెన్స్ హాస్టల్‌కి రూ.50 కోట్లు
డెంటల్ హాస్టల్‌కి రూ.6 కోట్లు
బాయ్స్ హాస్టల్ పునరుద్ధరణ, మరమ్మతులకు రూ.50 లక్షలు
ఉస్మానియా లేడీస్ హాస్టల్ వద్ద సీసీ రోడ్ల పునరుద్ధరణకు రూ.40 లక్షలు
మొత్తం ఉస్మానియా వసతి భవంతులు, రోడ్లకు రూ.121.90 కోట్ల విడుదల
గాంధీ ఆసుపత్రికికి మొత్తం రూ.79.50 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు
గాంధీ మెడికల్ కాలేజీలో లేడీస్ హాస్టల్ నిర్మాణానికి రూ.42 కోట్లు
గాంధీ మెన్స్ హాస్టల్ నిర్మాణానికి రూ.23 కోట్లు
గాంధీలో ఎస్ఆర్ బ్లాక్ హాస్టల్ నిర్మాణానికి రూ.14.50కోట్లు
కాకతీయ యూనివర్సిటీలో సీసీరోడ్లకు రూ2.75 కోట్లు కేటాయింపు
మొత్తం ఉస్మానియా, గాంధీ, కాకతీయ వర్సిటీలకు కలిపి రూ.204.85 కోట్లు కేటాయిస్తూ జీవో

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10