AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అలక వీడిన జీవన్ రెడ్డి.. పార్టీనే ముఖ్యమంటూ వ్యాఖ్య

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలక వీడారు. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశమనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీనే ముఖ్యమంటూ ఆయన పేర్కొన్నారు. మారుతున్న పరిస్థితుల కారణంగా కొన్ని నిర్ణయాలు తప్పవన్నారు. సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తామని కేసీ వేణుగోపాల్ హామీ ఇచ్చారంటూ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మాట్లాడుతూ.. ఎన్నికల హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు. రూ. 31 వేల కోట్లతో రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

అనంతరం దీపాదాస్ మున్షీ మాట్లాడుతూ.. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికి ప్రాధాన్యత తగ్గదన్నారు. ‘పార్టీలో జీవన్ రెడ్డి సీనియర్. ఏ నిర్ణయం తీసుకున్నా ఆయనతో చర్చించే ముందుకెళ్తాం. పీసీసీ పదవీ కాలం ముగింపు అంటూ ఏమీలేదు. పీసీసీపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది’ అంటూ ఆమె పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. తన సొంత నియోజకవర్గమైన జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ను పార్టీలోకి చేర్చుకోవడంతో జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు తదితరులు చర్చలు జరిపినా ఆయన శాంతించలేదు. తన ప్రమేయం లేకుండా జరగాల్సింది జరిగిపోయిందంటూ జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

దీంతో హైకమాండ్ రంగంలోకి దిగింది. తమ దూతగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్షీకి జీవన్ రెడ్డితో చర్చలు జరపాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మున్షీ జీవన్ రెడ్డికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. బుధవారం ఢిల్లీకి రావాల్సిందిగా హైకమాండ్ నుంచి జీవన్ రెడ్డికి ఫోన్ వచ్చింది. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ జీవన్ రెడ్డిని వెంటబెట్టుకుని ఢిల్లీకి వెళ్లారు. అనంతరం అక్కడ అగ్ర నేతలతో సమావేశమయ్యారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10