– అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్, దీపాదాస్ మున్షీ
(అమ్మన్యూస్, న్యూఢిల్లీ):
పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ నేత ఏపీ జితేందర్ రెడ్డికి కాంగ్రెస్ కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలో ఆయన బుధవారం ఉదయం ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో తెలంగాణ హక్కుల కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని అన్నారు. అలాగే రాష్ట్రానికి అంతర్జాతీయ ఈవెంట్స్ వచ్చేలా కృషి చేస్తాన తెలిపారు. కాగా గతంలో ఈ బాధ్యతలను కాంగ్రెస్ సీనియర్ నేత మల్లురవికి అప్పగించగా ఆయన పార్లమెంట ఎన్నికల్లో పోటీ చేసే క్రమంలో తెలంగాణ ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన నాగర్ కర్నూల ఎంపీగా గెలుపొందారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నేతలు తదితరులు జితేందర్‌రెడ్డిని అభినందించారు.
