AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

త్వరలో జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు.. ప్రధాని మోదీ

కేంద్ర పాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు మొదలయ్యాయని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. త్వరలోనే జమ్ముకశ్మీర్ తిరిగి రాష్ట్ర హోదా పొందనున్నదని అన్నారు. జమ్ముకశ్మీర్‌లో రెండు రోజుల పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ గురువారం శ్రీనగర్‌లో రూ.1500 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కశ్మీర్ లోయలో జరిగిన ఉగ్రదాడులను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తుందని, తగిన సమయంలో శత్రువులకు ధీటుగా సమాధానం ఇస్తామన్నారు. కశ్మీర్ లోయలో శాంతి, అభివృద్ధికి విఘాతం కలిగించేందుకు కొన్ని శక్తులు చేస్తున్న ప్రయత్నాలను సాగనివ్వబోమని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో జమ్ముకశ్మీర్ యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడం ద్వారా ప్రజాస్వామ్య విజయం సాధించారని అన్నారు. జమ్ముకశ్మీర్‌లో 370వ ఆర్టికల్ అడ్డుగోడ తొలగిపోయి అందరికీ రాజ్యాంగ ఫలాలు అందుతున్నాయని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం (జూన్ 21) డాల్ సరస్సు వద్ద నిర్వహించే యోగా కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారు.

ANN TOP 10