(అమ్మన్యూస్, హైదరాబాద్):
బెంగళూరు రేవ్ పార్టీ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో నటి హేమ, ఆషీరాయ్, వాసు డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. కాగా, డ్రగ్స్ కేసులో పాజిటివ్ రావడంపై నటి హేమ తాజాగా స్పందించారు. ‘ఏం చేస్తారో చేసుకోండి.. సరైన సమయం వచ్చినప్పుడే ఈ విషయంపై మాట్లాడతా’ అన్నారు. ఇక, బెంగళూరు పోలీసులకు తన పేరు కృష్ణవేణి అని హేమ చెప్పినట్లు తెలుస్తోంది. పోలీసు రికార్డుల్లో హేమ పేరును కృష్ణవేణిగా పోలీసులు నమోదు చేశారు. కాగా, ఈ కేసులో నటి హేమతో పాటు పలువురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. డ్రగ్స్ బాధితులకు కౌన్సెలింగ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తెలుగు నటులు బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ వాడినట్లు తేలడంతో హైదరాబాద్ నార్కోటిక్ పోలీసులు సైతం వారిని విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
