ప్రముఖ నటుడు, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్ అస్వస్థకు గురయ్యారు. వెంటనే ఆయనను గుజరాత్ అహ్మాదాబాద్‌లోని కేడీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ టీమ్‌కు యజమాని అయిన షారుక్ నిన్న బుధవారం సన్‌రైజర్స్‌తో జరిగిన మొదటి ఎలిమినేటర్ మ్యాచ్ కోసం నిన్న అహ్మదాబాద్‌కు వచ్చారు. మ్యాచ్‌లో విజయం సాధించిన అనంతరం అక్కడే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. రాత్రి అక్కడే బస చేశారు.
అయితే నిన్న అహ్మాదాబాద్‌లో ఎండ తీవ్రతతో షారుఖ్ వడదెబ్బకు గురవడంతో పాటు మైల్డ్ హాట్‌స్ట్రోక్ రావడంతో వెంటనే కేడీ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం షారుఖ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నదని, ఎలాంటి భయం లేదని వైద్యులు తెలియజేశారు.
ఈక్రమంలో తోటి ఐపీఎల్ టీమ్ సహ యజమాని జూహీచావ్లా ఆస్పత్రికి వచ్చి షారుఖ్ ను పరామర్శించారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రి చుట్టూ పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా అభిమానులు షారుఖ్ త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేస్తున్నారు.