జూన్ 4న దేశవ్యాప్తంగా రైతులందరికీ రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. జులై 1న మహిళ అకౌంట్లలో రూ. 8, 500 జమ అవుతాయని అన్నారు. మంగళవారం ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన బహిరంగా సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మహిళలను లక్షాధికారులను చేయడమే కాంగ్రెస్ పార్టీ విధానమని అన్నారు. ఇండియా కూటమి గెలిస్తే ఎంఎస్‌పీ ధరకు చట్టబద్దత కల్పిస్తామని చెప్పారు. అదానీ, అంబానీ మీడియా ఏం రాసుకుంటుందో రాసుకోవాలని సవాల్ విసిరారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లవి రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర చేస్తున్నారని అన్నారు. రాజ్యాంగం రద్దు అయితే ప్రజలు బానిసలు అవుతారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ హక్కులను బీజేపీ లాక్కుంటుందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.









