ఈ ఎన్నికల్లో తనను గెలిపించేందుకు ప్రజలు ముందే డిసైడ్ అయ్యారని బీజేపీ నాయకురాలు, మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివృద్ధి కార్యక్రమాలు చూసే తనకు ఓటు వేశారని చెప్పారు. మంగళవారం మహబూబ్‌నగర్‌లో మీడియాతో ఆమె మాట్లాడారు. ఎన్నికల వేళ తమ పార్టీ కార్యకర్తలను చాలా మంది బెదిరించారని, ఎన్ని బెదిరించిన బీజేపీ కార్యకర్తలు వెనక్కి తగ్గ లేదన్నారు. తన గెలుపు పోలింగ్‌కు ముందే నిర్ణయమైపోయిందని ఆశాభావం వ్యక్తం చేశారు. తనను గెలిపించాలని ప్రజలు ముందే నిర్ణయించుకున్నారని వ్యాఖ్యానించారు. మోడీ అభివృద్ధి కార్యక్రమాలు చూసే ప్రజలు తనకు ఓటేశారని పేర్కొన్నారు. కేంద్రం అమలు చేస్తున్న అనేక పథకాలు పేదలకు అందుతున్నాయని అన్నారు. దేశం కోసం.. ధర్మం కోసం.. అంటూ ఏకపక్షంగా బీజేపీకి ప్రజలు ఓటేశారని అన్నారు. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానంలో విజయం కాషాయ పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కష్టపడ్డారని, మోడీ మళ్లీ ప్రధాని కావాలని పార్టీలకు అతీతంగా చాలామంది ఓటేశారని తెలిపారు. ఓటర్ల అభీష్టం మేరకే మోడీ మూడోసారి భారత ప్రధాన మంత్రి అవుతారని డీకే అరుణ విశ్వాసం వ్యక్తం చేశారు.









