బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
(అమ్మన్యూస్, హైదరాబాద్):
లోక్సభ ఎన్నికల ఫలితాలపై బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణాలో అన్ని పార్టీల కంటే బీజేపీనే ఎక్కువ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంపై తెలంగాణ ప్రజల్లో కూడా నమ్మకం కలిగి.. సానుకూలత పెరిగిందని అన్నారు. దేశాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే సత్తా మోదీకే ఉందని అందరిలోనూ ఆలోచన మొదలైందని తెలిపారు.
రాష్ట్రంలో ఆగష్టు 15లోపు రుణమాఫీ చేయకుంటే.. సంక్షోభం తప్పదని హెచ్చరించారు. భవిష్యత్తులో కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం కాబోతోందని జోస్యం చెప్పారు. బీజేపీ 12కు పైగా సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనేక చోట్ల రెండో స్థానం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ నెలకొందని సెటైర్ వేశారు. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత చూద్దామన్నా బీఆర్ఎస్ ఎక్కడా కనిపించదు అని ఎద్దేవా చేశారు. కేసీఆర్, కేటీఆర్ నియంత ధోరణే ఆ పార్టీని బొంద పెట్టిందని కీలక వ్యాఖ్యలు చేశారు.









