హైదరాబాద్: తెలంగాణలో సమస్యాత్మక ప్రాంతాల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అయితే ఇప్పటికే క్యూలైన్లలో నిల్చున్న వారికి ఓటు వేయడానికి ఎన్నికల అధికారులు అవకాశం కల్పించారు.
వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల్లోని భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ లోని పలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది. సాయంత్రం నాలుగు గంటలలోపు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న వారికి మాత్రమే అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు.









