AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఈ చల్లటి రోజు చల్లటి పని చేశా.. స్మితా సబర్వాల్‌

(అమ్మన్యూస్‌, హైదరాబాద్‌):
తెలంగాణలో ఎంపీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోంది. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌, కేటీఆర్‌, పొంగులేటి, సినీ నటులు అల్లు అర్జున్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ సహా పలువురు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే డైనమిక్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌గా పేరొందిన స్మితా సబర్వాల్‌ సైతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈ విషయాన్ని ట్విట్టర్‌ వేదికగా ఆమె పంచుకున్నారు. వేలికి సిరాచుక్క ఉన్న తన ఫొటోను షేర్‌ చేసిన స్మితా సబర్వాల్‌ ‘ఈ చల్లటి రోజు చల్లటి పని చేశాను…. అని రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే.. రెండు నెలలుగా జోరుగా సాగిన సార్వత్రిక ఎన్నికల పోరు తుది ఘట్టానికి చేరుకుంది. సోమవారం తెలంగాణ వ్యాప్తంగా ఎంపీ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది.

ANN TOP 10