హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా 17 లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40.13 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో 36 శాతం పోలింగ్ నమోదైనట్లు పేర్కొన్నారు. ఏపీలో ఇప్పటి వరకు కోటిన్నర మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో మ. ఒంటి గంట వరకు 50.18 శాతం, నాగర్కర్నూల్ పరిధిలో 45.15 శాతం, జహీరాబాద్ పరిధిలో 50.17 శాతం, మల్కాజ్గిరి పరిధిలో 27.69 శాతం, మెదక్ పరిధిలో 46.72 శాతం, వరంగల్ పరిధిలో 41.62 శాతం పోలింగ్ నమోదైంది.









