AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సిద్దిపేట జిల్లా చింత‌మ‌డ‌క‌లో ఓటేసిన కేసీఆర్..

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా చింత‌మ‌డ‌క‌లో బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ ఆయన సతీమణి శోభతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన వెంట మాజీ మంత్రి హ‌రీశ్‌రావుతో పాటు బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోలింగ్ బాగా జ‌రుగుతోందన్నారు. 65 శాతానికి మించి పోలింగ్ జ‌రిగే అవ‌కాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎన్నిక‌ల త‌ర్వాత దేశంలో ప్రాంతీయ పార్టీల‌దే కీల‌క పాత్ర అవుతుందని పేర్కొన్నారు. కేసీఆర్ రాకతో చింతమడకలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్థులకు అభివాదం చేస్తూ తిరుగుపయనం అయ్యారు.

ANN TOP 10