తెలంగాణ రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతోంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు టాలీవుడ్ ప్రముఖలు పోలింగ్ కేంద్రానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఓటు వేశారు. జూబ్లీహిల్స్‌లోని ఓబుల్‌రెడ్డి స్కూల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్.
తల్లి, భార్యతో కలిసి పోలింగ్ కేంద్రానికి చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్ అందరితో కలిసి క్యూలైన్లో నిల్చున్నారు. తన వంతు వచ్చే వరకు వేచి ఉండి అనంతరం వేటు వేశారు.
అదేవిధంగా ఈ ఉదయాన్నే అల్లు అర్జున్ ఫిలింనగర్‌లోని బీఎస్ఎన్ఎల్ ఆఫీస్‌లో ఉన్న పోలింగ్ కేంద్రానికి వచ్చారు. బన్నీ కూడా క్యూ లైన్లో నిలబడి తన వంతు వచ్చేవరకు వేచి ఉండి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. వీరితో పాటు రాజమౌళి, శ్రీకాంత్, మంచు మనోజ్ తదితరులు ఓటు వేశారు.









