హైదరాబాద్: మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హైదరాబాద్‌లోని నందినగర్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తెచ్చిన నాయకుడికే తన ఓటు వేసినట్లు పేర్కొన్నారు.
“రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. మంచి చేసే నాయకులను ఆశీర్వదించాలని కోరుతున్నా. ఓటు వేయకుండా తర్వాత నిందిస్తే ఉపయోగం లేదు. కరెంట్ పోకుండా జనరేటర్లు పెట్టి జాగ్రత్తలు తీసుకున్న అధికారులను అభినందిస్తున్నా. నేను తెలంగాణ తెచ్చిన పార్టీకి, నాయకునికి ఓటు వేశా” అని కేటీఆర్ కామెంట్స్ చేశారు.









